చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే వంకాయ
కూరగాయల్లో వంకాయ అంటే ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారు. గుత్తొంకాయ రుచి దానికదే సాటి. దీనితో వెపుడు, పచ్చడి వంటివి కూడా చేసుకుని తింటారు. వంకాయలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంకాయ తొక్కలో యాంథోసియానిన్స్ ఉంటాయి.
ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. షుగర్ వ్యాధులతో బాధపడేవారికి ఎంతో సహాయపడుతుంది. వంకాయ చెడు కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా కాపాడుతుంది. వంకాయలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి వంకాయ మంచి ఆహారం. జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది.
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది. నరాల వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆకలిని పెంచుటలో వంకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వంకాయ ఆకుల రసంలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి.