గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 13 జులై 2019 (12:18 IST)

బరువు తగ్గాలా? పొట్ట తగ్గాలంటే..? ఇంట్లో వండుకుంటే బెటర్

బరువు తగ్గాలి.. పొట్ట తగ్గాలనుకుంటే.. ముందుగా కొవ్వు పదార్థాల్ని పూర్తిగా మానేయాలని లేదు. సరైన కొవ్వు పదార్థాలు ఎంచుకోవడం కూడా చేయాలి. వాటివల్ల కూడా త్వరగా ఆకలి వేయదు. నట్స్‌, గింజలు తీసుకోవడంతోపాటు ఆలివ్‌నూనె కూడా ఎంచుకోవాలని వైద్యులు చెప్తున్నారు. అలాగే మాంసకృత్తులు ఉన్న ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
పిండి పదార్థాలతో పోలిస్తే... మాంసకృత్తులు పొట్ట నిండినట్లుగా అనిపిస్తాయి. జీర్ణం కావడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందుకే గుడ్డు, వెన్నతీసిన పాలు, సోయా వంటివి తీసుకోవాలి. అదే మాంసాహారులైతే చికెన్‌ని ఎంచుకోవచ్చు. 
 
బరువు తగ్గాలనుకునేవారు మాంసకృత్తుల తరువాత ఎంచుకోవాల్సిన మరో పదార్థం పీచు. రోజులో కనీసం పదిగ్రాములైనా సాల్యుబుల్‌ పీచు అందేలా చూసుకోవాలి. ఇందుకోసం ఒక చిన్న యాపిల్‌, అరకప్పు బ్లాక్‌బీన్స్‌ లేదా రాజ్‌మా తీసుకున్నా చాలు. బయటి పదార్థాలు తినడం తగ్గించి... ఇంట్లో వండుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. పోషకాహారాన్ని తీసుకోగలుగుతారు.