గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 జులై 2019 (21:08 IST)

ఆ సమయంలో స్త్రీలు నెలలు నిండాక శృంగారానికి....

తల్లి కావడం అనేది ఆడవారికి దేవుడు ఇచ్చిన వరం. పెళ్లైన ప్రతి స్త్రీ దీనిని పొందాలని తహతహలాడుతుంటుంది. గర్బం ధరించినాక దానిని స్త్రీ కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకుంటుంది. గర్బం ధరించిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
 
1. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంతో ఉండడానికి పౌష్టికాహారమైన పాలు, పండ్లు, మాంసం, గుడ్లు తీసుకోవాలి.
 
2. గర్భం ధరించిన స్త్రీలు బరువైన వస్తువులు మోయకూడదు. ఎప్పుడూ తగిన విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 
 
3. నెలలు నిండిన స్త్రీలు ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కారం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తే ప్రయాణంలో కుదుపులు లేకుండా చూసుకోవాలి.
 
4. నెలలు నిండాక శృంగారానికి దూరంగా ఉండడం చాలా మంచిది.
 
5. గర్బిణీ స్త్రీలు వత్తిడీ, భయానికి లోను కాకూడదు. అది వారి కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతుంది.
 
6. నెలలు నిండిన స్త్రీలు హైహీల్స్ చెప్పులు వాడకపోవడం మంచిది. ఇలా వాడడం వలన అదుపు తప్పి పడిపోయినప్పుడు కడుపులోని బిడ్డకది ప్రమాదం.
 
7. అలాగే నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం శ్రేయస్కరం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వైద్యులను సందప్రదిస్తూ వారు చెప్పిన మందులను క్రమంతప్పకుండా వాడాలి.
 
8. సుఖ ప్రసవం కోసం తేలికపాటి వ్యాయామం చేయాలి. అలాగే ప్రసవం అయిన తరువాత పుట్టిన బిడ్డకు తల్లి చనుపాలు ఇవ్వడమే ఉత్తమం. తల్లి చనుపాలు వల్ల బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.