గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 11 జులై 2019 (17:35 IST)

శుభకార్యాల్లో ఆడవాళ్ల గొంతుకు గంధం ఎందుకు? (Video)

వివాహం అయిన తరువాత స్త్రీ భర్త ఇంటిలోని వారితో పాటు బంధువులు, స్నేహితులు...... ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి. భర్త, అత్తా, మామ వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా, సౌమ్యంగా మాట్లాడాలి. గంధం మెడకు రాయడం ద్వారా గొంతు సరళంగా వస్తుంది. సున్నితంగా, సరళంగా, తీయగా మాట్లాడడం వల్ల ఆమెపై గౌరావాబిమానాలు పెరుగుతాయి. 
 
ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా, వినమ్రతగా ఉన్నా.... మాట గట్టిగా, కఠినంగా ఉంటే తమను ఎదిరించి మాట్లాడుతుందని అనుకునే ప్రమాదం ఉంది. స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరము ఉండాలని గంధం రాస్తారు. అంతేకాకుండా గంధం శుభానికి సూచన కూడా.
 
తధాస్తు దేవతలు అసలు ఉంటారా...
తధాస్తు దేవతలు ఎల్లవేళలా ఉంటూ సాయం సంధ్యవేళల్లో ఎక్కువగా సంచరిస్తుంటారని ప్రతీతి. చెడు మాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరక్తం చేస్తుంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తధాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. 
 
మనిషి తన ధర్మానికి విరుద్దంగా అనకూడని మాట పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తధాస్తు అంటారట. వీరినే తధాస్తు దేవతలు అంటారు. అలాంటి సమయలలో స్వసబందమైన విషయాలను పలుమార్లు అనిన యెడల అట్టి దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటారట. ధనం ఉండి కూడా తరచూ డబ్బు లేదలేదని పలుమార్లు నటిస్తూ ఉంటే నిజంగానే లేకుండా పోతుందట...