గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (15:37 IST)

నువ్వులను శీతాకాలంలో ఎందుకు తీసుకోవాలంటే?

నువ్వులు, పాలతో పోలిస్తే మూడు రెట్లు కాల్షియం కలిగి ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ బి, ఇ, ఐరన్, జింక్, ప్రోటీన్, కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పాలల్లో లేవు. అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది.
 
శీతాకాలంలో నువ్వుల నూనెతో ముఖానికి మసాజ్ చేస్తే, ముఖ చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది. పొడి చర్మానికి ఇది మేలు చేస్తుంది. ఇంకా నువ్వులను శీతాకాలంలో ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 
 
నువ్వుల నూనెలో, విటమిన్ ఏ, విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనెను వేడి చేసి చర్మంపై మసాజ్ చేయడం వల్ల, చర్మము నిగారింపు పొందుతుంది. జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. కీళ్ల నొప్పులు ఉంటే, నువ్వుల నూనెలో కొద్దిగా శొంఠి పొడి, చిటికెడు ఇంగువ పౌడర్ వేసి వేడి చేసి మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది.
 
నువ్వులు, బాదం కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. నువ్వుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటాయి. నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా చాలా త్వరగా క్షీణించటానికి అనుమతించదు. నువ్వుల నూనెలో, విటమిన్-సి మినహా అన్ని అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయి, ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
 
నువ్వులు విటమిన్ -బి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. నువ్వులనూనెలోని పోషకాలు హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి. మెథోనిన్ కాలేయాన్ని సరిచేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.