గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 జనవరి 2020 (21:20 IST)

కమలాతో సంపూర్ణ ఆరోగ్యం, ఎలా?

చాలామంది కమలాలు తినడానికి ఇష్టపడరు. అయితే కమలాలతో ఆరోగ్యం ఉందంటున్నారు వైద్య నిపుణులు. కమలాలలో ప్లైవనాయిడ్సు, పాలిఫినాల్స్ వంటి ఫైట్ న్యూట్రియంట్స్, కొలెస్ట్రాల్‌ను రక్షిస్తుందట. బి.పి.ని తగ్గిస్తుందట. గుండె జబ్బులను కూడా నిరోధిస్తుందట. క్యాన్సర్ బారిన పడకుండా కమలాలు కాపాడతాయట.
 
నోరు, గొంతు, జీర్ణాశయ కేన్సర్లు, అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధులు, డయాబెటీస్, కాటరాక్స్, కలరా, మూత్రాశయంలో రాళ్ళు, శ్వాసకోస క్యాన్సర్‌ను నిరోధించే శక్తి కమలాలకు ఉందట. అలాగే కమలాలు రోజూ తింటే వ్యాధిక నిరోధక శక్తి పెరుగుతుందట. 
 
రోజుకో పండు తింటే అల్సర్లు రావు, లంగ్ క్యాన్సర్లు అసలే రావని వైద్య నిపుణులు చెబుతున్నారు. కమలారసం కన్నా పండు ఒలిచి తింటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందట. అంతేకాకుండా మలబద్దకం వదులుతుందట. ఇరిటబుల్ సిండ్రోమ్ ఉన్న వారికి కమలాలు అద్భుతంగా కూడా పనిచేస్తాయట.
 
కమలా పండ్లను డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు నిరభ్యంతరంగా తినొచ్చట. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించే శక్తి ఈ పళ్ళకు ఉందట. 3-4 పళ్ళు తింటే వయస్సుతో వచ్చే కంటిచూపు మందగించడం సమస్యను చాలా వరకు నిరోధిస్తుందట.