సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (21:23 IST)

అమ్మాయిలకు శారీరక ఆనందం ఇష్టమా.. మానసిక ఆనందం ఇష్టమా?

చాలామంది అమ్మాయిలను మొత్తం చదివేసినట్లు మాట్లాడుతుంటారు.. వారికి ఏం ఇష్టమో.. ఏం అయిష్టమో వారికే తెలిసినట్లుగా మాట్లాడుతుంటారు. అమ్మాయిలంతా ఇలానే అన్నట్లు కథలు చెబుతుంటారు. కానీ, నిజాలు అవేవీ కావని చెబుతున్నాయి పరిశోధనలు.
 
అమ్మాయిలు కొన్ని విషయాల్లో చాలా జెన్యూన్‌గా ఉంటారు. అయితే, ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఒకేలా ఆలోచించరు.. ఒకే విధంగా ఉండరు.. అయితే పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే అమ్మాయిల్లో ఎక్కువ మంది తమని శారీరకరంగా ఇష్టపడేవారికంటే.. మానసికంగా కోరుకున్న వారికే ఇంపార్టెన్స్ ఇస్తారట. వారినే నిజంగా ప్రేమిస్తారట.. కోరుకుంటారట.
 
మహిళలు ఎక్కువగా తమని ఇష్టపడాలని కోరుకుంటారట. వారిపై కొంత ప్రేమ చూపిస్తే చాలు వారిని మరిచిపోరని చెబుతున్నారు పరిశోధకులు. వీలైనప్పుడల్లా వారితో హ్యాపీగా మాట్లాడుతూ కొద్దిగా ప్రేమను చూపిస్తే చాలని చెబుతున్నారు. అదేవిధంగా తమకి ఎప్పుడూ దగ్గరగా ఉంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటే చాలు.. నిజానికీ శారీరక అనుబంధం అనేది మానసిక అనుబంధంతో పోల్చితే ఎంతో గొప్పదని చెబుతున్నారు. శారీరకం అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. కానీ, మానసికంగా అనేది వారిని ఎప్పటికీ విడిచిపోదని చెబుతున్నారు.
 
కొంతమంది వ్యక్తులు అమ్మాయిలది ఏముంది.. డబ్బు కోరుకుంటారు. పర్స్ తప్ప వారికి ఏం అవసరం లేదని మాట్లాడుతుంటారు. అలాంటి విషయాలు ఎప్పటికి నిజం కాదని చెబుతున్నారు నిపుణులు. అది కేవలం మాట్లాడుకోవడానికి కామెడీగా మాత్రమే ఉంటాయి. కానీ, నిజానికి మహిళలు ఒక్కసారిగా ఇష్టపడితే వారి ప్రేమనంతా వారికే పంచాలనుకుంటారు. స్వార్థం లేని ప్రేమని చూపిస్తారని చెబుతున్నారు. వారి ప్రేమ ముందు అన్ని దిగదుడుపే అని అంటున్నారు.
 
మెంటల్ అట్రాక్షన్‌‌తో పోల్చుకుంటే ఫిజికల్ అట్రాక్షన్‌ని అంతగా ఇష్టపడరని చెబుతున్నాయి పరిశోధనలు. ఫిజికల్ అట్రాక్షన్‌ని ఆ టైమ్‌లో మాత్రమే కోరుకుంటారని.. కానీ, ఆ తర్వాత వాటి గురించి పెద్దగా ఆలోచించరని చెబుతున్నారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే వారికి మెంటల్లీ దగ్గర అవ్వాలని సూచిస్తున్నారు కూడా.. వారికి ఏ కష్టం వచ్చినా.. మేమున్నాం అని ఓ భరోసాని ఇచ్చి వారి వెన్నంటే నిలిస్తే చాలు అని చెబుతున్నారు. ఇలాంటి వారిని అసలు మహిళలు మరిచిపోరని చెబుతున్నారు. వారి కోసం ఆరాటపడతారని చెబుతున్నారు. అలాంటి వారిని తమ కంటి రెప్పల్లా కాచుకుంటున్నారని చెబుతున్నారు.
 
చాలామంది అనేక విషయాల్లో మహిళలను చులకనగా చూడడం, మాట్లాడడం చేస్తుంటారు. వారికి కేవలం ఇంటి పనులే అంకితం చేస్తుంటారు. కానీ, నేటి మహిళలు అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారు. కొన్ని విషయాల్లో చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఆడవారు మగవారు కంటే ఆ పరిస్థితులను బాగా చక్కబెట్టగలరు. వాటిని చక్కగా సరిదిద్దగలరు. ఇది చాలా పెద్ద కంపెనీలు గుర్తించాయి. అందుకే వారికి పెద్ద పెద్ద కొలువులు ఇచ్చి అందులో కూర్చొబెడుతున్నాయి. ఈ కారణంగా మహిళల ఎదుగుదలను కోరుకుంటూనే వారితో పాటు తమ బిజినెస్‌ని అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నారు.