తిరగబెట్టిన మోకాలి గాయం.. మహేశ్‌కు ఆపరేషన్?!

mahesh babu
ఠాగూర్| Last Updated: సోమవారం, 27 జనవరి 2020 (13:48 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కొంతకాలం సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్నారు. ఎందుకంటే ఆయనకు మోకాలి గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం దీనికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ కారణంగా ఆయన సినిమాలకు దూరంగా ఉండనున్నారు.

ఇటీవల మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ విదేశీ టూర్‌లో ఉన్న మ‌హేష్ త్వరలోనే మోకాలికి ఆపరేషన్ చేయించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఇందుకోసమే ఆయన ఉన్నట్టుండి అమెరికా వెళ్ళాడ‌ని అంటున్నారు. ఈ గాయం 'ఆగ‌డు' సినిమా షూటింగ్ సమయంలో తగిలింది. దీనికి చికిత్స చేయించుకున్నారు. అయితే, ఈ గాయం మళ్లీ తరగబెట్టడంతో ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు హీరో అమెరికా వెళ్లాడ‌న్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ప్రీ ఆప‌రేటివ్ మెడిక‌ల్ చెక‌ప్స్ ముందుగా చేయించుకోనున్న మ‌హేశ్ అవ‌స‌ర‌మైతే వెంటనే స‌ర్జరీ కూడా చేయించుకుంటాడ‌ట‌. ఒక వేళ స‌ర్జ‌రీ చేయించుకుంటే మూడు నెల‌ల విశ్రాంతి త‌ర్వాత మ‌హేష్ తిరిగి షూటింగ్‌లో పాల్గొన‌నున్నార‌ని చెబుతున్నారు. మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌రోసారి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు మహేశ్ సిద్ధమైన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఈ చిత్ర ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి.దీనిపై మరింత చదవండి :