1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh extends half-day school schedule amid heatwave

ఏపీలో ఒంటిపూట బడులు పొడగింపు

schools
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా బడులను ఒక్కపూట మాత్రమే నిర్వహిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరానికిగాను ఈ నెల 12వ తేదీన ఒంటిపూట బడులను పునఃప్రారంభించారు. అయితే, ఎండల తీవ్ర అధికంగా ఉండటంతో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను నిర్వహించాలని తొలుత భావించారు. ప్రస్తుతం ఈ ఎండలు ఇంకా తగ్గకపోవడంతో మరోమారు ఒంటిపూట బడులను పొడగించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 24వ తేదీ వరకు ఒంటి పూట బడులను నిర్వహించాలని ఆదేశించారు. 
 
జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను జరపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గక పోవడంతో తాజాగా ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ బడులను ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుదంని పాఠశాల విద్యాసఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
కేకే లైనులో పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. కొనసాగుతున్న రైళ్ల రద్దు