1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anna Prasada center in Tiruchanoor

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఇక నుంచి అమ్మవారి చెంత కడుపు నిండా భోజనం..!

Anna Prasada center
తిరుచానూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభించారు టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. తోళప్పగార్డెన్స్‌లో భక్తులకు అందుబాటులో అన్నప్రసాద కేంద్రంను టిటిడి నిర్మించింది. రూ. 6.70 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మించినట్లు టిటిడి ఛైర్మన్ మీడియాకు తెలిపారు. నూతన అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించే అవకాశం రావడం తనకు పూర్వజన్మ సుకృతమన్నారు. భవిష్యత్తులో అన్నదాన భవనంలో మరో రెండు ఫ్లోర్లు నిర్మిస్తున్నామన్నారు.
 
శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద పథకాన్ని ఏఫ్రిల్ 6, 1985సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రారంభించినట్లు చెప్పారు టిటిడి ఛైర్మన్. రోజుకు 2వేల మంది భక్తులతో ప్రారంభించి నేడు రోజుకు సరాసరి 1.50లక్షల మందికిపైగా భక్తులు ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. 
 
ఎస్వీ అన్నప్రసాద ట్రస్టుకు ఇప్పటివరకు రూ. 1021.29 కోట్లను విరాళంగా అందించిన దాతలకు రోజుకు 7 టన్నుల మేరకు కూరగాయలను విరాళంగా అందిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్నప్రసాదాల ద్వారా శ్రీవారి భక్తులకు కడుపునిండా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు.
About Writer
జె
తర్వాతి కథనం
నవంబర్ 12న రాత్రి గం.9 డిస్కవరీ చానెల్లో.... కేరళ వరదలు-ఒక మానవత దృక్పథంలోని విజయగాథ