1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM Jagan Mohan Reddy claims Coronavirus cases cured

కరోనా ఎవరికైనా రావొచ్చు... మందులు వేసుకుంటే పోతుంది : సీఎం జగన్

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరోమారు మాటతూలారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రికి మాత్రం చీమకుట్టినట్టుగా లేదు. అందుకే కరోనా వైరస్‌ను లైట్‌గా తీసుకున్నట్టుగా ఉన్నారు. 
 
"ఈ కరోనా వైరస్ ఎవరికైనా సొకవచ్చు. పైగా, కరోనా నయమవుతుంది" అంటూ సెలవిచ్చారు. అంతేకాకుండా, 'కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం సరికాదు. అది అమానవీయం' అంటూ హితవు పలికారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం కరోనా వైరస్‌ నియంత్రణపై జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకొన్న ఘటన ఈ సందర్భంగా సీఎం దృష్టికి వచ్చింది.
 
వీటిపై ఆయన స్పందించారు. కరోనా సోకినవారిని అంటరానివాళ్లుగా చూడడం సరికాదు. కరోనాతో చనిపోయినవారి అంతిమ సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం ఏమాత్రమూ సరికాదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవాళ్లు సైతం ఇలా చేయడం తగదు. ఇలా అడ్డు కున్నవారిలో ఎవరికైనా వైరస్‌ సోకవచ్చు. అంత్యక్రియలను ఎవరైనా అడ్డుకుంటే సీరియ్‌సగా తీసుకోవాలి. 
 
కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అది నేరం కూడా. కేసులూ పెట్టవచ్చు అని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. పైగా, మందులు తీసుకుంటే కరోనా పోతుందని, అదికూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనా వైరస్‌ ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తమ్ముడిని బావిలోకి తోసి... యువతిపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?