సంబంధిత వార్తలు
- నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత
- కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేక వరద బాధితులకు కోటి రూపాయలు నేనే ఖర్చు పెట్టా: బొత్స
- మోసం చేయడమంటే ఇదేనేమో ... కూటమి సర్కారుపై వైఎస్.షర్మిల ధ్వజం
- Varma: నాగబాబు కోసం పిఠాపురం వర్మను పక్కనబెట్టేస్తే ఎలా? పవన్ అలా చేసివుంటే బాగుండేది?
- కుమారుడుకి విషమిచ్చి.. కుమార్తెకు ఉరివేసి చంపేశారు.. దంపతుల ఆత్మహత్య!!
బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...
రౌడీ షీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర గడువు ముగిసేలోపు పోలీసులకు లేదా రాజమండ్రి అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ కుమార్‌కు హైకోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది.
న్యాయస్థానం నిబంధనల ప్రకారం మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ లొంగిపోవాలి. అయితే, ఆయన సాయంత్రం వరకు లొంగిపోలేదు. పైగా, తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను పొడగించాలని మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన గడువులోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని హెచ్చరించింది. చెన్నైలో ఉంటే విమానంలో అయినా వచ్చి లొంగిపోవాలని ఆదేశించింది. కానీ, ఆయన మాత్రం లొంగిపోలేదు.
ఇదిలావుంటే, తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ నెల 1వ తేదీన మధ్యంతర బెయిల్ గడువును బోరుగడ్డ అనిల్ పొడగించుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు.
