రామ్ పోతినేని RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్
Sam C.S.,Ram Pothineni
ఈ సినిమా షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఖైదీ, పుష్ప 2, మహా అవతార్ నరసింహ వంటి చిత్రాలకు అదిరిపోయే సౌండ్ ట్రాక్స్ అందించిన సామ్ సిఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. #RAPO23లో సామ్ సిఎస్ చేరడంతో మ్యూజికల్ కూడా ఈ చిత్రం భారీ అంచనాలని నెలకొల్పింది. #RAPO23లో మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రాశారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోంది.
దర్శకత్వం, కథతో పాటు కథానాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను పోషించబోతున్నారు. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
విభిన్నమైన కథ, భారీ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల కలయికతో తెరకెక్కుతున్న #RAPO23 రామ్ పోతినేని కెరీర్‌లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలవనుంది.
