సంబంధిత వార్తలు
- వారికి నచ్చిన ఆటగాడు లేకపోవడంతో బెదిరించి తప్పించారు : హనుమ విహారి!!
- మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్.. మెగా డీఎస్పీపై తొలి సంతకం..
- వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్
- ప్రజాదర్బార్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు వినతులు వెల్లువ!!
- పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్
ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌లో 78 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ బుధవారం రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో జనరల్ కేటగిరీలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే, వొకేషనల్‌లో 78 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/లో ఉంచింది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
జనరల్ కేటగిరీలో 80 శాతం, ఒకేషనల్ కోర్సులో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్కుల మెమోలను జూలై ఒకటో తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
కాగా, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు ఉంటే మరికొందరు మార్కుల ఇంప్రూమెంట్ కోసం రాసిన వారున్నారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
