1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Ayyanna Setairs on Sajjala

సజ్జలకి అయ్యన్న సెటైర్లు

Ayyanna
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఆయన ఏమన్నారంటే...
 
"జగన్ రెడ్డి..ఇప్పటికైనా అక్రమాస్తులు ప్రభుత్వ ఖజానాకి జమ చేసి చట్టాన్ని గౌరవించండి.  ఏడాదిలో రాజకీయ నాయకుల పై పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

43 వేల కోట్ల ప్రజా ధనం దోపిడీ,యాలహంక రాజప్రసాదం,లోటస్ పాండ్ ప్యాలస్,తాడేపల్లి లో విలాసవంతమైన విల్లా,పేదల భూములు కొట్టిసి కట్టిన ఇడుపులపాయ ఎస్టేట్,దొంగ సొమ్ముతో పెట్టిన సాక్షి,క్విడ్ ప్రోకోతో పెట్టిన భారతి సిమెంట్స్ ఇలా అనేక ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది.

రకరకాల పిటిషన్లు వేసి 10 ఏళ్ళు గడిపేసారు.ఇప్పటికైనా దోచుకున్న సొత్తు ప్రజలకు ఇచ్చేయండి. లేకపోతే మరోసారి జైలుబాట తప్పదు. చట్టాల గురించి లెక్చర్లు ఇస్తున్న సజ్జల రెడ్డి ముందు అక్రమ సొత్తుతో కట్టిన ఇళ్లను కాళీ చెయ్యమని జగన్ రెడ్డిని డిమాండ్ చెయ్యాలి."
About Writer
ఎం
తర్వాతి కథనం
అక్టోబ‌రు 2న అమెరికా విద్య‌పై అంత‌ర్జాల‌ స‌ద‌స్సు