సంబంధిత వార్తలు
- విశాఖ రాజధానితో సీమ వాసులకు ఇబ్బందులు... ఉద్యమాలు తప్పవు : టీజీ వెంకటేష్
- బీసీజీ నివేదిక కూడా అమరావతి తరలింపునకే మొగ్గు?
- నిర్ణయం తీసుకున్నా.. జనవరి 20న ఆమోదముద్రవేద్దాం : మంత్రులతో జగన్!!
- రాజధాని తరలింపు ఖాయం... అసెంబ్లీ ఉమ్మడి భేటీకి సీఎం జగన్ వ్యూహం
- మళ్లీ ఎన్నికలకు వెళ్దాం.. మీరు గెలిస్తే ఎక్కడైనా పెట్టుకోండి.. జగన్కు సవాల్
మూడు రాజధానులు : హైపర్ కమిటీ ఏర్పాటు - సభ్యులు వీరే
రాజధాని తరలింపు విషయంపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ తన నివేదిక ఇచ్చింది. వచ్చే నెల మూడో తేదీన బోస్టన్ కన్సల్టెంట్ కంపెనీ మరో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు మంత్రులు, ప్రభుత్వ అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో జగన్ కెబినెట్‌లోని పలువురు మంత్రులు, ముఖ్య అధికారులు ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇవ్వనుంది. కాగా, ఈ కమిటీలో సభ్యుల వివరాలను పరిశీలిస్తే,
మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నానిలు ఉన్నారు.
వీరితో పాటు ముఖ్యమంత్రి ప్రదాన సలహాదారు, రాష్ట్ర డీజీపీ, చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటీ, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులకు ఈ కమిటీలో చోటు కల్పించింది.
