1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. CBI handovered weapons related ys viveka murder case

వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం

YS Viveka Murder Case
వైకాపా నేత, వైఎస్సార్ సోదరుడు వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం సీబీఐ అధికారులు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. రహస్యంగా ఆయుధాల కోసం కోనసాగించిన అన్వేషణ జరిపిన సిబిఐ అధికారులు.. ఎట్టకేలకు వాటి జాడను కనుక్కున్నారు. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ సోదాలు నిర్వహించారు.
 
ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం.. జిల్లాలోని 20మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించింది.. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తుకు లేదని సునీల్ యాదవ్ చెప్పడంతో.. తనదైన శైలిలో విచారణ జరిపింది సీబీఐ అధికారుల బృందం. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఏకకాలంలో నలుగురి ఇళ్ళలో ఆయుధాల కోసం సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ… వారిళ్లల్లోనే ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ తో స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు సిబిఐ అధికారులు. ఆయుధాల విషయం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పంద్రాగ‌స్టుకు ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియం ముస్తాబు