1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (17:24 IST)

వదల బొమ్మాళీ వదల అంటున్న ఆర్ఆర్ఆర్ - ఇపుడు సాయిరెడ్డికి షాక్

వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ పెద్దలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. మొన్నటికిమొన్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇపుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 
 
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని పిటిషన్‌లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. విజయసాయిరెడ్డికి శనివారం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి, సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది.