ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (18:22 IST)

వివేకా హత్య కేసు.. ఆయుధాల అన్వేషణకు బ్రేక్

వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంతవరకు తవ్వకాలు నిలిపివేయాలని సీబీఐ ఆదేశించింది. దీంతో మునిసిపల్ సిబ్బంది రోటరీపురం, గారండాల వాగు దగ్గర తవ్వకాలు నిలిపివేశారు. 
 
పోలీసులు బారికేట్లు తొలగించి పికెటింగ్ ఎత్తివేయడంతో ఆ మార్గంలో యధావిధిగా రాకపోకలను అనుమతిస్తున్నారు. 26 మంది మునిసిపల్ సిబ్బంది మూడు రోజులపాటు తీవ్రంగా శ్రమించినా ఆయుధాల జాడ కనిపించలేదు. 
 
మురికినీటిని తొలగించి జేసీబీ యంత్రాల సాయంతో వ్యర్థపు మట్టిని తీసివేసి వెతికారు.. అయినా ఆయుధాల జాడ కనిపించలేదు. ఇక అటు సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను విచారించే అవకాశం ఉంది.