సంబంధిత వార్తలు
- జగన్ పాలకుడు కాదు.. కక్షదారుడు.. బాబు అరెస్ట్‌పై బాలయ్య
- స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్
- ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట.. తోషాఖానా కేసులో మూడేళ్ల శిక్ష నిలిపివేత
- నేడు ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల... హాజరుకానున్న బాబు - నడ్డా
- చంద్రబాబును కలిసి యార్లగడ్డ వెంకట్రావు.. ఎక్కడ నుంచైనా పోటీ చేస్తా!!
నారా లోకేశ్‌ను అడ్డుకోవడం దారుణం.. కొనసాగుతోన్న హౌస్ అరెస్ట్‌లు
Nara LOkesh
మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోండు శంకర్‌ను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. విశాఖ డాక్టర్ కాలనీలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని, ఏదైనా ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని చెప్పారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అన్నారు. తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు.
