1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chandrababu Naidu comments on Prime Minister Post

ప్రధాని పదవికి నేను పోటీ కాదు : చంద్రబాబు

ప్రధానమంత్రి పదవిపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటను వెల్లడించారు. ఒక ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఉన్న తనకు తన పరిమితులేంటో తనకు తెలుసన్నారు.

Chandrababu Naidu
ప్రధానమంత్రి పదవిపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటను వెల్లడించారు. ఒక ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఉన్న తనకు తన పరిమితులేంటో తనకు తెలుసన్నారు. అందువల్ల పదవికి తాను పోటీ కాదని, తన రాష్ట్రాన్ని ఉన్నతపథంలోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. 
 
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు లండన్‌లో ప్రతిష్టాత్మక 'గోల్డెన్ పీకాక్ లీడర్ షిప్' అవార్డును ప్రదానం చేశారు. బ్రిటన్ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబును సభికులకు పరిచయం చేస్తూ... భారత ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు చంద్రబాబుకు ఉన్నాయంటూ నిర్వాహకులు పేర్కొన్నారు. దీనికి సమాధానంగా చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యానించారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
2018 మార్చిలో చంద్రయాన్-2 .. సిద్ధమవుతున్న ఇస్రో