1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. chittore TDP

చిత్తూరు జిల్లాలో ఎన్‌ఆర్‌ఐలే తెదేపాకు "అండ"

చిత్తూరు జిల్లా... ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎపి సిఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా ఈ ప్రాంతం. ఈ జిల్లాలో పుట్టి, పెరిగి, విద్యనభ్యసించాడు బాబు. ప్రపంచంలోనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాంది

chittore TDP
చిత్తూరు జిల్లా... ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎపి సిఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా ఈ ప్రాంతం. ఈ జిల్లాలో పుట్టి, పెరిగి, విద్యనభ్యసించాడు బాబు. ప్రపంచంలోనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్నారు. ఇలాంటి ప్రాంతానికి బాబు ఖర్చు పెట్టింది ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో సుమారు 50 మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు ఉండడమే కారణం. ఆ ఎన్‌ఆర్ఐలలో సగానికి పైగా తెలుగుదేశంపార్టీ నాయకులే. ఇంకేముంది. కథంతా.. అక్కడే ఉంది...పార్టీ కార్యక్రమాలు ఏది జరిగినా వీరు ఇచ్చే డబ్బులతోనే జరుగుతుంది. పార్టీ ఫండ్‌ అంటారా.. అలాంటిది చిత్తూరు జిల్లా తెదేపా నేతలకు అసలు తెలియదు.
 
తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ. తెలుగు ప్రజల గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పేందుకు స్థాపించిన పార్టీ. అయితే అప్పట్లో సినీ నటుడిగా ఎన్‌టిఆర్‌ ఉండటంతో ఆ పార్టీని ప్రజలు ఎంతగానో ఆరాధించారు. ఎన్‌టిఆర్‌ను దేవుడిగా కొలిచారు కూడా. ఇంకేముంది ఎన్‌టిఆర్‌ సిఎం అయ్యారు. ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్‌టిఆర్‌ కుమార్తెను చంద్రబాబు వివాహం చేసుకోవడంతో పార్టీ పగ్గాలు ఆయన చేతిలోకి మారాయి.
 
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రజాప్రతినిధిగా ప్రతిసారి ఎన్నికవుతున్నారు చంద్రబాబు. ఇదంతా పక్కన బెడితే ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది. ఎపిలోని 13 జిల్లాలకు సిఎం చంద్రబాబు. పార్టీ నుంచి ఎలాంటి కార్యక్రమం ఏ ప్రాంతంలో జరిగినా పార్టీ ఫండ్‌తోనే ఆ కార్యక్రమ నిర్వహణ జరగాలి. మిగిలిన జిల్లాల విషయం పక్కనబెడితే చిత్తూరు జిల్లాలో ఖచ్చితంగా పార్టీ ఫండ్‌ ఖర్చు పెట్టి తీరాలి. ఎందుకంటే ఈ జిల్లాకు వ్యక్తి చంద్రబాబు కావడమే. 
 
అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్నా పార్టీ నుంచి ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు విదిల్చిన పాపాన పోలేదు. కారణం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలే. ఈ ఎన్‌ఆర్‌ఐలే తెదేపాకు శ్రీరామ రక్షగా మారుతున్నారు. ప్రతి కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐలే డబ్బులు పోస్తున్నారు. ఎన్‌ఐఆర్‌లు ఎందుకు డబ్బులు కుమ్మరిస్తున్నారా! అన్న అనుమానం రాకమారదు. వీరికీ తెదేపా పదవులున్నయి మరి. జడ్పీటీసీ, ఎంపిటిసిలను చేశారు బాబు. ఇంకేముంది ఎన్‌ఆర్‌ఐలు ఆటోమేటిక్‌గా డబ్బులు కుమ్మరించేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ఏది జరిగినా అంతా వీరి డబ్బులే. 
 
పార్టీలో ఉన్న పాపానికి కొందరు తిట్టుకుని డబ్బులు ఇస్తే మరికొందరైతే ఏమీ అనలేక డబ్బులను ఇచ్చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఏమైనా అంటే ఇక తెలిసిందేగా వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదు. అదే భయం. అలా జిల్లాలో 25మంది  ఎన్‌ఆర్‌ఐ మీదే తెలుగుదేశం పార్టీ నడిచిపోతోంది. గతంలో జరిగిన మహానాడు నుంచి ప్రస్తుతం చిత్తూరులో జరుగుతున్న జడ్పీ పాలకవర్గం రెండేళ్ళు పూర్తయిన కార్యక్రమం వరకు ఏదైనా సరే సర్వం ఎన్‌ఆర్‌ఐలే. అయితే దీనిపై విమర్శలు వస్తున్నా ఏ మాత్రం అధినేత పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
About Writer
ttdj
తర్వాతి కథనం
నాకు బంగారు తెలంగాణ వద్దు...: ATAలో యార్లగడ్డ వ్యాఖ్య