శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (18:13 IST)

అసెంబ్లీకి హాలీడే.. ఎందుకంటే చదువుకోవడానికి.. అయ్యన్న సెటైర్లు

Ayyanna Patrudu
Ayyanna Patrudu
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ బుధవారానికి (నవంబర్ 13)కు వాయిదా పడింది.
 
బీఏసీలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఉంటుందని.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరగాలన్నారు. 
 
మంగళవారం బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అయ్యన్న తెలిపారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ నిర్వహణ ఉంటుందన్నారు. 
 
ఎనిమిది బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని బీఏసీలో నిర్ణయించినట్లు అయ్యన్న వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత రఘురామ రాజుతో రఘురామా మీ ఫ్రెండ్ రాలేదా అంటూ వైకాపా చీఫ్‌ జగన్‌ను ఉద్దేశించి అయ్యన్న అడిగారు. వెంటనే లైవ్‌లో చూస్తారు సార్ అంటూ ఆర్ఆర్ఆర్ చెప్తుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నవ్వుకున్నారు.

ఇంకా "రేపు హాలిడే సభకు ఎందుకంటే రాజుగారు.. చదువుకోవడం కోసం.. బడ్జెట్‌పై అవగాన కోసం" అంటూ అయ్యన్న తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై చదువుకోవడం కోసం రేపు సెలవు అనేసరికి అందరూ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.