1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Coronavirus cases not reduced, curfew extended in Chittoor district

కరోనావైరస్ కేసులు తగ్గట్లేదు, చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ పొడిగింపు, సమయం కుదింపు

Coronavirus cases
చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల పెరిగిపోతున్నాయి. అందుకు కారణం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పక్కపక్కన ఉండటమే. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే సమయాన్ని మరింతగా కుదిస్తున్నాం. 
 
ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతినిచ్చాం. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని 10 గంటల వరకే పెడుతున్నాం. జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సమయం ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా కర్ఫ్యూకు అందరు సహకరించాలని విజ్ఙప్తి చేశారు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.
 
తిరుపతిలోని వెటర్నరీ కళాశాలలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు మంత్రులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎపిలో వేగంగా జరుగుతోందని.. ఆగష్టు నెల లోపల ఎపిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
తర్వాతి కథనం
ఐదేళ్ల సహజీవనం.. గర్భం దాల్చగానే వదిలేశాడు.. మంత్రిపై నటి శాంతిని ఫిర్యాదు