గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 16 మే 2021 (19:29 IST)

ఏపీలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు: 24 గంటల్లో 24,171 మందికి కరోనా, 92 మంది మృతి

రాష్ట్రంలో గత 24 గంటల్లో 94, 550 శాంపిల్స్ పరీక్షించగా 24, 171 మందికి కోవిడ్ 19 అని తేలింది. కోవిడ్ వల్ల అనంతపురంలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 9, కృష్ణా జిల్లాలో 9, విజయనగరంలో 9, నెల్లూరులో 7, కర్నూలులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, పశ్చిమగోదావరిలో 3, కడపలో 2 మరణించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,32,596 పాజిటివ్ కేసు లకు గాను 12,12,788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,436. కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో మృతి చెందనవారి సంఖ్య 9,372 మంది.