శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (22:25 IST)

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 40,956 కేసులు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40,956 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్‌ వల్ల మరో 793 మంది మరణించారు. 
 
ఒక్క రోజే 71,966 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఒక్క ముంబైలోనే 1717 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. 51 మంది ప్రాణాలు కోల్పోగా 6082 మంది కోలుకున్నారు. 
 
రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 51,79,929కు చేరింది. ప్రస్తుతం 5,58,996 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 77,191కు పెరిగింది. 
 
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. 18నుంచి 44ఏళ్ల వయస్సున్న వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. 
 
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 45ఏళ్ల పైబడ్డ వారికి సెకండ్ డోస్ వేయడానికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు
 
వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రస్తుతం 18 నుంచి 44ఏళ్ల వయస్సున్న వారికి వ్యాక్సిన్ వేయడాన్ని వాయిదా వేద్దాం. 2.75 లక్షల వ్యాక్సిన్ డోసులు మిగిలి ఉన్నాయి. వీటిని 45ఏళ్లు పైబడ్డ వారికి మాత్రమే వేయనున్నారు.
 
అంతేకాకుండా పేషెంట్లు మ్యుకోర్మికోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ జబ్బుతో సతమతమవుతున్నారు. మహాత్మా జ్యోతిబాపూలె జన్ ఆరోగ్య యోజన పథకంలో భాగంగా వారందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. రాష్ట్రంలో రీసెంట్ గా 2వేల కేసులు నమోదుకాగా 8మంది ఇన్ఫెక్షన్ పెరిగి చనిపోయారు. ఈ పేషెంట్ల కోసం స్పెషల్ వార్డులు ఏర్పాటు చేశారు.