శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (19:29 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 96 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనాతో బాధపడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 96 మంది మృతి చెందారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 89,535 కరోనా పరీక్షలు చేయగా, 22,517 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 14,11,320 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,78,80,755 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
 
కోవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో అనంతపురంలో 12 మంది మృతి చెందగా, నెల్లూరులో 11, తూర్పుగోదావరి 10, విశాఖ 9, విజయనగరం 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 8, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, కర్నూలు 5, ప్రకాశం 5, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తాజాగా 18,739 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 11,94,582 మంది కరోనా నుంచి బయటపడ్డారు.