1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (07:56 IST)

రాజారెడ్డి రాజ్యాంగం ఉంటే.. బతిమాలుడేందన్నో... : జవహర్ వ్యంగ్యాస్త్రాలు

దేశవ్యాప్తంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలవుతుంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలువుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. అంతేకాకుండా, మన మోడల్ మనకుంటే.. ఒకడ్ని బతిమిలాడుకునేంది ఏందన్నా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
రాష్ట్రానికి సరిపడా కరోనా టీకాలు, ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై టీడీపీ విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో టీకాలు ఉత్పత్తి చేసేది చంద్రబాబు, రామోజీరావు వియ్యంకులేనని, వారి బంధుత్వం ఉపయోగించి టీకాలు ఇప్పించాలంటూ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై జవహర్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మన మోడల్‌ మనకు ఉన్నప్పుడు వ్యాక్సిన్‌ ఇప్పించాలని బతిమాలుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. 'మనం కన్నెర్ర చేస్తే గంగవరం, కృష్ణపట్నం పోర్టు ఓనర్లు వణుక్కొంటూ అయినకాడికి మనోడికి వాటిని అమ్మేసి పోయారు. మొండికేసిన సంగం డెయిరీ ఛైర్మన్‌ను రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కూర్చోబెట్టాం. మాట వినకపోతే జువారీ సిమెంటు, అమర్‌ రాజా బ్యాటరీస్‌ కంపెనీలకు కాలుష్యం నోటీసు ఇచ్చి మూసేయించాం. వ్యాక్సిన్‌ కంపెనీవోడు ఇంతకన్నా మొనగాడా ఏంది? వ్యాక్సిన్లు ఇప్పించాలని చంద్రబాబును, రామోజీరావును మనం బతిమాలుకోవడం ఏందన్నా? సిగ్గు పోతోంది. మన మోడల్‌ మనకుందిగా' అని జవహర్‌ పేర్కొన్నారు.