గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (11:53 IST)

కరోనా బాధితురాలిపై వార్డ్ బాయ్ లైంగిక దాడి.. 24 గంటల్లో మహిళ మృతి

మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై ఎక్కడపడితే అక్కడ అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా బాధితురాలిని కూడా కామాంధులు వదిలిపెట్టట్లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితురాలిపై వార్డు బాయ్ లైంగిక దాడికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. 
 
అయితే, ఈ ఘటన గత నెల 6న భోపాల్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చేరిన ఓ మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని 43 మహిళ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వెంటనే ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌కు తరలించారు. అదే రోజు సాయంత్రం చికిత్స పొందుతూ కన్నుమూసింది.
 
ఈ ఘటనపై నిషాత్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా.. నిందితుడు సంతోష్‌ అహివార్‌ (40)గా గుర్తించారు. అరెస్టు చేసి భోపాల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఘటనపై సీనియర్‌ పోలీస్‌ అధికారి ఇర్షాద్‌ వలీ మాట్లాడుతూ బాధితురాలు పోలీసులకు దరఖాస్తు ఇచ్చిందని, అయితే తన గుర్తింపును కాపాడాలని.. ఘటన గురించి ఎవరికీ తెలియనివ్వొద్దని కోరిందని పేర్కొన్నారు. 
 
దీంతో దర్యాప్తు బృందం తప్ప ఎవరితోనూ సమాచారం పంచుకోలేదన్నారు. నిందితుడు 43 ఏళ్ల స్టాఫ్‌ నర్సుపై సైతం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో ఉద్యోగంలో ఉన్న సమయంలో మద్యం సేవించినందుకు సస్పెండ్‌ చేశారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.