మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 28 డిశెంబరు 2020 (15:03 IST)

రజినీకాంత్‌కు రాజకీయాలు వేస్ట్, నాగార్జున.. మీ ఇంట్లో మహిళల్ని రోడ్డుపైన నిలబెడతావా? ఎవరు?

బిగ్ బాస్ షోతో మహిళలను నాగార్జున అవమానించారని.. బిగ్ బాస్ పైన త్వరలో హైకోర్టుకు వెళ్లి పిటిషన్ దాఖలు చేస్తానన్నారు సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ. ముగ్గురు మహిళల ఫోటోలు పెట్టి ముద్దు ఎవరికి పెడతావు.. డేటింగ్ ఎవరితో చేస్తావంటూ కించపరిచే విధంగా నాగార్జున మాట్లాడారని.. అదే తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలను నాగార్జున అలా పెట్టగలరా అంటూ ప్రశ్నించారు. 
 
ముకేష్ అంబానీకి మనవడు పుడితే ఫంక్షన్‌కు ప్రధాని పరుగెత్తుకుని వెళ్ళారని.. అయితే  కూతవేటు దూరంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల దగ్గరకు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిద్ర లేచినప్పటి నుంచి మోడీ చెప్పేవన్నీ  అబద్థాలేనంటూ మండి పడ్డారు. 
 
జగన్ ఎపిలో పులి.. ఢిల్లీలో పిల్లి అంటూ విమర్శించారు. తండ్రి వైఎస్ఆర్‌కి మూడు నామాలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న కుక్కలకు సెంటు భూమి సరిపోదని.. కుక్కల కంటే హీనంగా రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారన్నారు.
 
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఉపరాష్ట్రపతి నోరు విప్పాలని.. పదవీకాంక్షతో వెంకయ్య మాట్లాడకుంటే తెలుగు ప్రజలకు అన్యాయం జరిగినట్లేనన్నారు. సినీ ప్రముఖులు రాజకీయాల్లో సక్సెస్ కాలేరని.. రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా జనం ఆదరించారన్నారు.