మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 26 డిశెంబరు 2020 (16:24 IST)

వైసిపి నేతలు ధార్మిక క్షేత్రాల పవిత్రతను మంటగలుపుతున్నారు: సోము వీర్రాజు

వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు బిజెపి రాష్ట్ర్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. మూడు రోజుల పర్యటనలో ఉన్న సోము వీర్రాజు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. అయితే ఆలయం ముందు వైసిపికి చెందిన మంత్రులు క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంపై సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
అలాగే ద్వారకా తిరుమలలో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెప్పడాన్ని తప్పుబట్టారు. తిరుపతిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ హిందూ ధార్మిక క్షేత్రాల్లో పవిత్రతను వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 
 
అలాగే ఎపిలో ఇళ్ళ నిర్మాణంలో 3 వేల కోట్ల అవినీతి జరిగిందని.. వైసిపిది ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎపిలో నిర్మితమవుతున్న ఇళ్ళ నిర్మాణాల్లో 75 శాతం కేంద్ర నిధులేనని స్పష్టం చేశారు బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు.