1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Director SS Rajamouli Speech At Traffic Awareness Program

ఇక్కడ శత్రువు ఎక్కడో లేడంటున్న రాజమౌళి (వీడియో)

హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ఓ అవగాహనా కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. ఇందులో మెగా ఫ్యామీలీ హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళిలు పాల్గొని యువతకు తమ అమూల్యమైన

SS Rajamouli
హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ఓ అవగాహనా కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. ఇందులో మెగా ఫ్యామీలీ హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళిలు పాల్గొని యువతకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చాడు. 
 
ముఖ్యంగా, రోడ్డు ప్రమాదాలకు కారణం ఎవరో కాదనీ, ఆ మరణాలకు మనమే కారణమంటూ వ్యాఖ్యానించారు. అంటే ప్రమాదాలకు శత్రువు ఎక్కడో లేడనీ, ఇక్కడే ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.50 లక్షల మంది చనిపోతున్నారనీ, ఈ మరణాలకు వాహనం డ్రైవ్ చేసేసమయంలో మనం చేసే చిన్నపొరపాట్లేనని చెప్పారు. కాగా, రాజమౌళి ప్రసంగానికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను... దూరం పెట్టడం వల్లే నిప్పంటించా : కార్తీక్