ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను... దూరం పెట్టడం వల్లే నిప్పంటించా : కార్తీక్
సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన సంధ్యారాణి అనే యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో ప్రేమోన్మాది గురువారం రాత్రే పోలీసులకు లొంగిపోయాడు.
సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన సంధ్యారాణి అనే యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో ప్రేమోన్మాది గురువారం రాత్రే పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత తాను ఈ దుశ్చర్యకు పాల్పడటానికి గల కారణాలను పోలీసులకు వెల్లడించాడు.
మూడేళ్ళుగా సంధ్యారాణితో పరిచయం ఉందనీ, ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పారు. కానీ, తన ప్రేమను కాదనడంతో తట్టుకోలేకనే ఇంత దారుణానికి ఒడిగట్టానని చెప్పాడు. అదేసమయంలో తనను దూరం పెట్టిన సంధ్య.. మరో యువకుడికి దగ్గరై, తనతో మాట్లాడటం మానేసిందని, సంధ్యకు ఫోన్ చేస్తే, అతనే లిఫ్ట్ చేస్తుండేవాడని, సంధ్య జోలికి రావద్దని బెదిరించాడని, తన కొలీగ్‌తో ఆమె ప్రేమలోపడి అతనితో సన్నిహితంగా ఉండటంతో తానెంతో కుమిలిపోయానని, తనను అవాయిడ్ చేసినందుకే ఈ పని చేశానని కార్తీక్ చెప్పుకొచ్చాడు.
కాగా, సికింద్రాబాద్‌లోని లాలాపేట ప్రాంతంకు చెందిన సంధ్యారాణిని ప్రేమిస్తూ వచ్చిన కార్తీక్ అనే యువకుడు, ఆమె తనను తిరస్కరించిందన్న కారణంతో, నడిరోడ్డుపై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో లాలాపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కార్తీక్ ఈ ఘాతుకానికి పాల్పడగా, 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో కార్తీక్ ఆ వెంటనే లొంగిపోగా, అతనిపై పెట్టిన హత్యాయత్నం కేసును, ఇప్పుడు హత్య కేసుగా మార్చనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, ఎస్సీఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.