బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (11:01 IST)

గ్రామస్థులను చంపేస్తున్న వీధి కుక్కలు.. ఎందుకు?

సాధారణంగా మనుషులను చూస్తే కుక్కలు భయపడి ఆమడదూరం పారిపోతాయి. పిచ్చికుక్కలను చూస్తే జనాలు కాస్త జంకుతారు. కానీ, ఆ గ్రామంలో మాత్రం వీధి కుక్కలను చూస్తే గ్రామస్థులంతా భయంతో వణికిపోతున్నారు.

సాధారణంగా మనుషులను చూస్తే కుక్కలు భయపడి ఆమడదూరం పారిపోతాయి. పిచ్చికుక్కలను చూస్తే జనాలు కాస్త జంకుతారు. కానీ, ఆ గ్రామంలో మాత్రం వీధి కుక్కలను చూస్తే గ్రామస్థులంతా భయంతో వణికిపోతున్నారు. దీనికి కారణం ఆ గ్రామవాసులను కుక్కలు చంపేస్తున్నాయి. ఇప్పటికే 32 మందిని చంపేశాయి. దీంతో ఆ గ్రామవాసులు వీధికుక్కలంటే గజగజ వణికిపోతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సాంబల్ గ్రామంలో వీధి కుక్కలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవి గత మూడు రోజుల వ్యవధిలోనే అనేక మందిని కరవడం వల్ల 32 మంది చనిపోయారు. దీంతో బయటకు వెళ్లాలంటేనే స్థానికులు భయపడుతున్నారు. తప్పనిసరై బయటికెళ్లేనా చేతిలో బడితే ఉండాల్సిందే.
 
కుక్కల భయంతో పిల్లలను పాఠశాలలకు కూడా పంపడం లేదు. ఇక్కడే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్టించుకునేవారు లేక ఏనాడో మూతపడింది. దీంతో ప్రభుత్వం తమను కుక్కల బారినుంచి కాపాడాలని ఆ గ్రామ వాసులు కోరుతున్నారు.