సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:47 IST)

ఆమెకు 16.. ఆయనకు 50.. ఫిరోజాబాద్‌లో బలవంతపు పెళ్లి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత యువతికి బలవంతపు వివాహం చేశారు. ఆ బాలిక వయసు 16 యేళ్లు కాగా, వరుడు వయసు 50 యేళ్లు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత యువతికి బలవంతపు వివాహం చేశారు. ఆ బాలిక వయసు 16 యేళ్లు కాగా, వరుడు వయసు 50 యేళ్లు. ఈ దారుణం ఫిరోజాబాద్ నగర సమీపంలోని సియార్ మావు గ్రామంలో వెలుగుచూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 16 యేళ్ల బాలిక ఉంది. వీరంతా కూలిపనులకు వెళుతూ పొట్టపోసుకుంటున్నారు. అయితే, ఇతనికి తెలియకుండానే బాలిక మేనమామ ఓ 50 యేళ్ల వయసున్న వ్యక్తి నుంచి రూ.2 లక్షలు తీసుకొని మైనర్ బాలికను అతనికిచ్చి పెళ్లి చేశాడు.
 
ఈ విషయం తెలిసిన తండ్రి తన కూతురి బలవంతపు వివాహం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సియార్ మావు గ్రామానికి వెళ్లి బాలికను రక్షించారు. బాలికను బలవంతంగా పెళ్లి చేసిన వారందరినీ అరెస్టు చేశారు. వరడు పరారీలో ఉండగా, అతని కోసం గాలిస్తున్నారు.