సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (12:37 IST)

మహిళలను అవమానించడంలో తెలుగు రాష్ట్రాలు టాప్

మహిళలను అవమానించే నేరాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. దేశవ్యాప్తంగా 2016లో చోటుచేసుకున్న నేరాలు, బాధితులు, కేసుల నమోదు తదిత రాలపై జాతీయ క్రైమ్ రికార్డు బ్య

మహిళలను అవమానించే నేరాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. దేశవ్యాప్తంగా 2016లో చోటుచేసుకున్న నేరాలు, బాధితులు, కేసుల నమోదు తదిత రాలపై జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో వార్షిక నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదికను బట్టి ఐటీతో పాటు అభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్న హైదరాబాద్ అమ్మాయిల అక్రమ రవాణా బాగోతాలతో అపకీర్తిని మూటగట్టుకుంది. అమ్మాయిలను అక్రమంగా తరలించి వ్యభిచార గృహాలకు విక్రయించడంలో హైదరాబాద్ నగరం దేశంలోనే నాల్గవస్థానంలో నిలిచింది.
 
జాతీయ నేర రికార్డుల సంస్థ అమ్మాయిల అక్రమ రవాణ, వ్యభిచార గృహాలకు విక్రయించిన అమ్మాయిల గురించి తన వార్షిక నివేదికలో, దేశంలో అమ్మాయిల విక్రయంపై 8,057 కేసులు నమోదు కాగా తెలంగాణలో 229 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 239 కేసులున్నాయి. వ్యభిచారం, అమ్మాయిల అక్రమ రవాణాలో ఏపీ మూడో స్థానం పొందింది. 
 
ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే కేసులు బెంగళూరు నగరంలో అత్యధికంగా 199 నమోదు కాగా ఆ తర్వాత  102 కేసులతో హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ నివేదికలో ఎక్కువ నేరాలు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో నమోదయ్యాయి. మహిళలపై అఘాయిత్యాలు అత్యధికంగా జరిగే నేరాల్లో యూపీ అగ్రస్థానంలో నిలిచింది.