ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (13:04 IST)

పాడేరు, అరకులో గెలిచేది వైకాపానే: గిడ్డి ఈశ్వరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన గిడ్డి ఈశ్వరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సైకిలెక్కినా వైకాపా గురించే ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో పాడేరు, అరకు నియోజ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన గిడ్డి ఈశ్వరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సైకిలెక్కినా వైకాపా గురించే ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది.

అలాగే, 2019లో కూడా పాడేరు, అరకులో వైకాపానే గెలుస్తుందన్నారు. దీంతో పక్కనున్న నేతలంతా నోరెళ్లబెట్టారు. కచ్చితంగా రాష్ట్రమంతా ఏం జరుగుతుందో తనకు తెలియదు కానీ.. పాడేరు, అరకులో మాత్రం డ్యామ్ ష్యూర్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గిడ్డి ఈశ్వరి చెప్పారు. 
 
పాడేరు, అరకులో వైకాపా పాతుకుపోయిందని.. అందుకు తాను కూడా కారణమేనని తెలిపారు. ఆపై వైకాపా చీఫ్ జగన్‌పై గిడ్డి ఈశ్వరి విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీని వీడుతున్నందుకు బాధపడుతున్నానని, ఆత్మాభిమానం చంపుకొని టీడీపీలో చేరుతున్నానన్నారు. జగన్‌తో విసిగిపోయానని గిడ్డి తెలిపారు. 
 
కాగా, ఈశ్వరి పార్టీ మారడానికి ప్రధాన కారణం అరకు వైసీపీ ఇంఛార్జ్ ఎంపికేనని తెలుస్తోంది. ఈశ్వరి అరకు వైసీపీ ఇంఛార్జ్‌గా ఓ పేరును ప్రతిపాదించగా వైసీపీ అధిష్టానం కుంభా రవిబాబును ఇంఛార్జ్‌గా నియమించారు. దీంతో అసంతృప్తికి లోనైన గిడ్డి ఈశ్వరి.. ఆ పార్టీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.