1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Jeevitha Rajasekhar likely to join TDP

సైకిలెక్కనున్న జీవితా రాజశేఖర్ దంపతులు

టాలీవుడ్‌కు చెందిన డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు త్వరలోనే మళ్లీ తెదేపా గూటికి చేరనున్నారు. రాక్ సీఎం చంద్రబాబు అంటూ జీవిత ఇటీవలే ప్రసంశలు కురిపించింది. పైగా, టీడీపీలో చేరుతున్నారా? అని అడిగితే... చే

Jeevitha Rajasekhar
టాలీవుడ్‌కు చెందిన డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు త్వరలోనే మళ్లీ తెదేపా గూటికి చేరనున్నారు. రాక్ సీఎం చంద్రబాబు అంటూ జీవిత ఇటీవలే ప్రసంశలు కురిపించింది. పైగా, టీడీపీలో చేరుతున్నారా? అని అడిగితే... చేరమంటే చేరుతామంటూ ఠక్కున సమాధానమిచ్చింది. దీంతో జీవిత రాజశేఖర్‌లు టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
 
నిజానికి జీవిత, రాజశేఖర్‌లు టీడీపీ సానుభూతిపరులుగానే వుండేవారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్‌లో చేరారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కారణంగానే జీవితకు సెన్సార్ బోర్డులో సభ్యురాలిగా చోటుదక్కింది.
 
అయితే, గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీకి మరింత సినీ గ్లామర్ అద్దడానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో తిరిగి మళ్లీ సొంత పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నా కారుకు యాక్సిడెంట్ కాలేదు.. నేను బాగానే ఉన్నా : బిగ్ బీ