మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (16:07 IST)

నా కారుకు యాక్సిడెంట్ కాలేదు.. నేను బాగానే ఉన్నా : బిగ్ బీ

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ కారు ప్రమాదానికి గురైందనీ, ఈ కారణంగా ఆయన తీవ్రంగా గాయపడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై బిగ్ బీ స్పందించారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ కారు ప్రమాదానికి గురైందనీ, ఈ కారణంగా ఆయన తీవ్రంగా గాయపడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై బిగ్ బీ స్పందించారు.
 
"నేను కోల్‌కతాలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నానని వెలువడుతున్న వార్తలు పూర్తిగా అబద్ధం. అసలు యాక్సిడెంటేమీ అవలేదు. నేను బాగానే ఉన్నా." అని ట్వీట్ చేశారు.
 
కాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అమితాబ్ కోల్‌కతా వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని శనివారం ఎయిర్‌పోర్టుకు తిరిగి వస్తుండగా.. ఆయన కారు వెనుక చక్రం ఊడిపోయి ప్రమాదానికి గురైనట్టు వార్తలు వెలువడ్డాయి.