శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (11:48 IST)

కాఫీతో ఆరోగ్యానికి, చర్మానికి ఎంత మేలో తెలుసా?

ఒక కప్పు కాఫీ తాగితే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు కనబడకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్‌లు కాఫీలో పుష్కలంగా వున్నాయి. కాఫీలో ఉండే కెఫిన్ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటాన్ని, చర్మం ఇన్ఫ్లమేషన్‌లకు గురవకుండా, చర్మ కణాల నుండి హానికర కారకాలను త

ఒక కప్పు కాఫీ తాగితే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు కనబడకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్‌లు కాఫీలో పుష్కలంగా వున్నాయి. కాఫీలో ఉండే కెఫిన్ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటాన్ని, చర్మం ఇన్ఫ్లమేషన్‌లకు గురవకుండా, చర్మ కణాల నుండి హానికర కారకాలను తొలగిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటిచుట్టూ ఉన్న చిన్న చిన్న రక్తనాళాలను బిగుతుగా చేసి, వాపులు ఇన్ఫ్లమేషన్‌కు గురయ్యే ప్రక్రియను తగ్గించి వేస్తుంది. ఈ విధంగా కాఫీలో కెఫిన్ చర్మ కణాల సమస్యలను తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
అలాగే నీరసంగా, డల్‌గా ఉండేవారు ఒక కప్పు కాఫీ తాగితే యాక్టివ్‌గా అవుతారు. చురుగ్గా పనిచేస్తారు. మెదడు షార్ప్‌గా ఆలోచిస్తుంది. ఉత్సాహంగా పనిచేయవచ్చు. మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏది చదివినా చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. వయస్సు పెరుగుతున్న వారిలో సహజంగా వచ్చే డెమెన్షియా, అల్జీమర్స్ వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 
టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు చక్కెర లేకుండా కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతో వారి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా మధుమేహం అదుపులో ఉంటుంది. షుగర్‌ను కంట్రోల్ చేసే గుణాలు కాఫీలో ఉన్నాయి. ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే కాలేయం పనితీరు మెరుగు పడుతుంది. అందులో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.