శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (10:16 IST)

వాణి విశ్వనాథ్ నాకు పోటీనా? నాకు హోం మంత్రి పదవి ఇస్తే చేస్తా: రోజా

సినీన‌టి వాణి విశ్వ‌నాథ్ తనకు పోటీనా.. తాను అలా అనుకోవట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సినీన‌టి వాణి విశ్వ‌నాథ్ టీడీపీలో చేర‌ుతున్నారు. రోజాకు పోటీగానే టీడీపీ వాణిని బరిలోకి

సినీన‌టి వాణి విశ్వ‌నాథ్ తనకు పోటీనా.. తాను అలా అనుకోవట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సినీన‌టి వాణి విశ్వ‌నాథ్ టీడీపీలో చేర‌ుతున్నారు. రోజాకు పోటీగానే టీడీపీ వాణిని బరిలోకి దించుతున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో... ఈ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. తాను ఎన్నో విషయాలపై పోరాడి రాజకీయంగా పైకొచ్చానని చెప్పారు. రాజ‌కీయంగా ఎన్నో ఒడిదుడుకుల‌ను చూశానని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాన‌ని అన్నారు. టీడీపీ అధికార పార్టీ కాబ‌ట్టి కొంద‌రు అందులో చేరుదామ‌నుకుంటున్నారని తెలిపారు. 
 
రాజ‌కీయాలంటే ఏంటో ఇందులోకి వ‌స్తేనే తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడి కుమారుడు నారా లోకేశ్ మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఎన్నో అన‌ర్థాలు జ‌రిగాయ‌ని రోజా ఎద్దేవా చేశారు. దేశ చ‌రిత్రలోనే ఏ ముఖ్య‌మంత్రి కొడుకూ దొంగ‌దారిలో మంత్రి కాలేదని అన్నారు. ప్ర‌జ‌ల ద్వారా ఎన్నికోబడితేనే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉంటుందని నారా లోకేష్‌పై రోజా సెటైర్లు విసిరారు.
 
ఎంత ఖర్చు అయినా తనను నగరిలో మరోసారి గెలవనివ్వకూడదని టీడీపీ నేతలు ప్ర‌య‌త్నిస్తున్నారని రోజా తెలిపారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి త‌న‌కు హోం మంత్రి ప‌ద‌వి ఇస్తే చేస్తాన‌ని అన్నారు. ఒక‌వేళ జ‌గ‌న్ త‌న‌కు హోం మంత్రిగా అవ‌కాశం ఇస్తే, మ‌హిళ‌ల‌కు న్యాయం చేస్తానని అన్నారు.
 
తాను 2004 నుంచి మ‌హిళ‌ల గురించి పోరాడుతున్నాన‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌కు న‌ష్టం క‌లిగిస్తోన్న ప్ర‌తి అంశంపై పోరాడుతూ వ‌స్తున్నాన‌ని తెలిపారు. నేర‌స్తుల‌ని త‌రిమికొట్టాల్సి ఉంద‌ని చెప్పారు. వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశ‌యాల‌ను క‌ల‌కాలం నిల‌బెట్టాల‌ని జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డుతున్నారని రోజా చెప్పారు.