సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 15 నవంబరు 2017 (20:34 IST)

జగన్‌ను చూసేందుకు కాదు హీరో, హీరోయిన్లను చూసేందుకే... జేసీ

వైఎస్ఆర్ సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్ల కులానికే తీరని మచ్చ ఏర్పడుతోందన్నారు ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జగన్ కారణంగా రెడ్లకు ఉన్న విలువ కాస్తా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వై.ఎస్.జగన్ రాజకీయాలు మాని మంచి పారిశ్రామికవేత్తగా

వైఎస్ఆర్ సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్ల కులానికే తీరని మచ్చ ఏర్పడుతోందన్నారు ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జగన్ కారణంగా రెడ్లకు ఉన్న విలువ కాస్తా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వై.ఎస్.జగన్ రాజకీయాలు మాని మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగితే బాగుంటుందని సలహా ఇచ్చారు. 
 
2019 సంవత్సరంలో రాజకీయాల నుంచే తను తప్పుకుంటున్నాననీ.. తనకు రాజకీయాల్లో ఉండాల్సిన పని ఇక లేదన్నారు జెసీ దివాకర్ రెడ్డి. వై.ఎస్.జగన్ పాదయాత్రకు వేలాదిమంది వస్తున్నారని మీడియా జె.సి.ని ప్రశ్నించగా హీరోలు, హీరోయిన్లు ఎవరు వచ్చినా జనం చూసేందుకు వస్తారు. అంతేతప్ప జగన్‌కు ఏదో ప్రజాదరణ ఉందని అనుకోవడంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు.