శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (20:44 IST)

విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పోరాటం మరువలేనిది... చంద్రబాబు పొగడ్త

నల్లారి కుటుంబం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. తెదేపాలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గురువారం తెదేపాలో చేరిన సందర్భంగా సీఎ

నల్లారి కుటుంబం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. తెదేపాలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గురువారం తెదేపాలో చేరిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారి కుటుంబం గురించి మాట్లాడారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికీ గుర్తిండిపోతుందన్నారు. విభజన వల్ల అన్యాయం జరుగుతుందని ఆయన సోనియా గాంధీపైన పోరాటం చేశారని గుర్తు చేశారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి కూడా సోనియాతో చేతులు కలిపినా అవన్నీ ఎదుర్కొని ఒంటరి పోరాటం చేశారని ప్రశంసించారు. ఇప్పుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేరికతో పీలేరులో తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగు లేదని, వారి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.