శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (16:48 IST)

షాపింగ్ చేసి.. సినిమాకు తీసుకెళ్లి.. థియేటర్‌లో గ్యాంగ్ రేప్

స్నేహం పేరుతో మాటామాటా కలిపి నమ్మించారు. ఆ తర్వాత ఆ యువతితో కలిసి షాపింగ్ చేశారు. ఆ పిమ్మట సినిమా చూసేందుకు థియేటర్‌కు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.

స్నేహం పేరుతో మాటామాటా కలిపి నమ్మించారు. ఆ తర్వాత ఆ యువతితో కలిసి షాపింగ్ చేశారు. ఆ పిమ్మట సినిమా చూసేందుకు థియేటర్‌కు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్‌కు సమీపంలోని మవానా పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మీరట్‌కు చెందిన 16 యేళ్ల యువతితో ఇద్దరు వ్యక్తులు సెల్‌ఫోన్‌లో స్నేహం చేశారు. దాదాపు రెండు నెలల పాటు మొబైల్‌లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు. స్నేహం పేరుతో మాట్లాడుకుంటూ.. అప్పుడప్పుడూ యువతిని కలుస్తూ వచ్చారు. 
 
ఈనేపథ్యంలో యువతితో మంగళవారం దుండగులు కలిశారు. మవానా పట్టణంలో షాపింగ్‌ తర్వాత సినిమాకు వెళ్లాలని అందరూ నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే సినిమాకు వెళ్లిన తర్వాత.. ఎవరూలేని ప్రదేశంలో ముగ్గురు కూర్చుకున్నారు. సినిమా ప్రారంభమైన తర్వాత.. ఇద్దరు యువకులు.. యువతిపై పాశవికంగా, రాక్షసంగా అత్యాచారం చేశారు.
 
యువతి అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి.. చేతులు కట్టేసి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన తర్వాత యువతిని తీసుకెళ్లి ముజఫర్‌నగర్‌ ప్రాంతంలో వదిలివెళ్లారు. ఆ తర్వాత బాధితురాలు నేరుగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, ఇద్దరు కామాంధులను అరెస్టు చేశారు.