శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (11:55 IST)

తెలుగు మాస్టారంటే చీప్-కానీ తెలుగు చదువుకొన్న వాడు ముఖ్యమంత్రి కాగలడు: హాస్య బ్రహ్మ

భాగ్యనగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రసంగం అదుర్స్ అనిపించింది. సీఎం కేసీఆర్‌‌పై బ్రహ్మానందం పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ కారణ జన్ముడని కొనియాడారు. తెలంగాణ ముద్దు

భాగ్యనగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రసంగం అదుర్స్ అనిపించింది. సీఎం కేసీఆర్‌‌పై బ్రహ్మానందం పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ కారణ జన్ముడని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డగా ఆయన పేరు సంపాదించాడని ప్రశంసించారు. తెలంగాణ కవి పాల్కురికి సోమనను, ఆపై బమ్మెర పోతనను తలచుకుని ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. వాగ్దాటి, పద్య పటిమతో వేదికను అదిరిపోయేలా చేశారు. 
 
బ్రహ్మానందం వాగ్దాటిని చూసిన బాహుబలి రాజమౌళి, సంభ్రమాశ్చర్యాలతో ఆయన మాటలను విన్నారు. తెలుగు మాస్టార్ అంటే చాలా చీప్ అని.. కానీ తెలుగు చదువుకున్న వాడు ముఖ్యమంత్రి కాగలడు, తెలుగు చదువుకున్న వాడు దేశాన్ని శాసించగలడు, తెలుగు చదువుకున్న వాడు తెలుగు మాస్టర్లకు ధైర్యాన్ని ఇవ్వగలడని బ్రహ్మానందం అన్నారు. కేసీఆర్‌ను అందరూ పొగడుతున్నారని.. తాను పొగడట్లేదన్నారు. ఓ కుటుంబంలో తొమ్మిది మంది తరువాత పుట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇప్పుడు మూడున్నర కోట్ల మందికి పెద్దదిక్కయ్యారని కొనియాడారు. 
 
తెలంగాణ జాతిపిత అని అనిపించుకునే స్థాయికి ఎదిగారని కొనియాడారు. తెలుగు భాషపై తనకు ఉన్న అభిమానాన్ని చూపించుకునే ఉద్దేశం కలగడం ప్రజలందరి అదృష్టమని చెప్పారు. ఇంకా బమ్మెర పోతనపై తనకు అభిమానం ఎక్కువని, తెలుగు మాస్టారును కాబట్టి గంట కొట్టితే గానీ పాఠాలు చెప్పడం ఆపని విధంగా.. ప్రసంగాన్ని కొనసాగించానని బ్రహ్మానందం వ్యాఖ్యానించారు. బ్రహ్మానందం ప్రసంగాన్ని విని వేదికపై ఆసీనులైన కళాకారులందరూ సంభ్రమాశ్చర్యానికి గురైయ్యారు.