1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Diwali onion bombs exploded while riding a bike in Eluru, one killed

ఏలూరులో బైకుపై వెళ్తుండగా పేలిన దీపావళి ఉల్లిగడ్డ బాంబులు, ఒకరి మృతి (video)

Diwali onion bombs exploded
దీపావళి బాణసంచాతో ఎంతో జాగ్రత్తగా వుండాలి. ఏమాత్రం ఏమరపాటుగా వుంటే బాణసంచా ప్రాణాల మీదికి తెస్తాయి. ఏలూరులో ఉల్లిగడ్డ బాంబులు పేలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. బైక్‌ పైన ఉల్లిగడ్డ బాంబులను ఓ మూటలో వేసుకుని తీసుకెళ్తుండగా పేలిపోయాయి. ఈ ఘటనలో బైకును నడుపుతున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
 
ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్‌పై ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళుతున్నారు. ఐతే బైకు బ్యాలెన్స్ తప్పి అది కాస్త గోతిలో పడింది. ఉల్లిగడ్డ బాంబులు బలంగా నేలను తాకితే పేలిపోతాయి. ఈ క్రమంలో బైకు బలంగా నేలకి గుద్దుకోవడంతో మూటలో వున్న ఉల్లిగడ్డ బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
తర్వాతి కథనం
"భరత్ అనే నేను" మూవీ చూస్తే కేరళ వాసులు నవ్వుకుంటారు.. కృష్ణతేజ ఐఏఎస్ (video)