గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (09:12 IST)

శ్రీశైలం రహదారి.. బైకుపై ప్రేమ జంట రొమాన్స్.. ముద్దులు.. (Video)

Lovers
Lovers
మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రేమ జంట రొమాన్స్ చేస్తూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆపై పోలీసులు ఆ జంటకు పదివేల జరిమానా విధించారు. ఇంకా రోడ్డుపై ఇలాంటి పిచ్చిపనులు చేస్తే జైలులో పెడతామంటూ హెచ్చరించారు. 
 
శ్రీశైలం రహదారిపై ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఈ బైక్‌పై రొమాన్స్ యవ్వారం హైదరాబాదుకు పాకింది. పెట్రోల్ ట్యాంకుపై ప్రియుడికి అభిముఖంగా కూర్చున్న యువతి అతడికి ముద్దులు పెడుతూ రొమాన్స్ చేసింది. 
 
పహాడీషరీఫ్ వద్ద జరిగిన ఈ ఘటనను మరో జంట వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇదికాస్తా వైరల్ అయింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇక ఈ జంటపై పోలీసులు సీరియస్ అయ్యే ఛాన్సుంది.