గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2024 (15:50 IST)

"భరత్ అనే నేను" మూవీ చూస్తే కేరళ వాసులు నవ్వుకుంటారు.. కృష్ణతేజ ఐఏఎస్ (video)

Krishna Teja
Krishna Teja
కేరళలో సమర్థుడైన ఐఏఎస్‌ అధికారిగా కృష్ణతేజ పేరు తెచ్చుకున్నారు. తన అద్భుతమైన పని తీరుతో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యవేక్షించే శాఖల్లో కృష్ణతేజ పనిచేస్తారు. 
 
కేరళ నుంచి ఏపీకి మూడేళ్ల పాటు డిప్యూటేషన్‌కు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ను ఆయన కలిశారు. సుపరిపాలన కోసం సమర్థులైన ఐఏఎస్‌లను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చారు. 
 
తాజాగా కృష్ణతేజ ఓ ఇంటర్వ్యూలో కేరళ పరిపాలనపై మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేరళలో పంచాయతీ ప్రెసిడెంట్.. పంచాయతీ సీఎం, మున్సిపాలిటీ ప్రెసిడెంట్.. మున్సిపాలిటీ సీఎం.. అంటే వాళ్లకు ఫుల్ పవర్స్ వుంటాయి. మున్సిపాలిటీ ప్రెసిడెంట్ సీఎం హోదాలో వుంటారు. అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ ఛైర్మన్ వుంటారు. ఆయన ఆ మున్సిపాలిటీకి విద్యాశాఖ మంత్రి హోదా రేంజ్‌లో వ్యవహరిస్తారు. 
 
అలాగే స్టాండింగ్ కమిటీ హెడ్ వుంటారు. ఆయన కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తారు. అలా మినీ గవర్నమెంట్ అనేది పంచాయతీ స్థాయి నుంచే కేరళలో రన్ అవుతూ వుంటుంది. కేరళ ప్రత్యేకతలు అంటే ఏమీ లేదు.. భరత్ అనే నేను మూవీలో మహేష్ బాబు ఎలాంటి పాలన చేశారో.. అదంతా 95లోనే కేరళలో చేశారు. 
 
అందుకే భరత్ అనే నేను మూవీని ఏ స్టేట్ వాళ్లు చూసినా సూపర్ అంటారు. అయితే కేరళ వాళ్లు చూస్తే కామ్‌గా ఏంటిది అంటూ ప్రశ్నిస్తారని కృష్ణతేజ అన్నారు. కేరళ వర్షాలకు సంబంధించి ఓ వార్తా పత్రికలో పెద్ద ఫోటో వచ్చింది. 
 
ఆ ఫోటోలో అంత భారీ వర్షాల్లో అంత జరిగినా ఓ వ్యక్తి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు హెల్మెట్‌తో క్యూల్లో నిల్చున్న ఫోటో అది. దీనిని బట్టి కేరళలో రాజకీయ నేతలు, ప్రజలకు ఏ రేంజ్‌లో సాయం చేస్తారో.. ప్రజలు కూడా రాజకీయ నేతలకు అదే తరహాలో సపోర్ట్ చేస్తారని.. రాజకీయ నాయకులకు, ప్రజలకు అక్కడ సమన్వయం వుంటుందని చెప్పారు కృష్ణతేజ అన్నారు. 
 
అలాగే కేరళలో చాలామంది చదువుకున్న వాళ్లున్నారని.. అధిక శాతం ప్రజలు మలయాళం అయినా చదువుతారని, వాళ్ల సంతకం వాళ్లు పెట్టగలరు. ఈ క్రమంలో కేరళ వాసులు రోజూ పత్రికలు చదువుతారని.. ప్రభుత్వం మన కోసం ఏం చేస్తుంది.. ప్రజల కోసం డబ్బు ఖర్చు చేస్తుందా అనేది తప్పకుండా రోజూ తెలుసుకుంటారని.. సమయం దొరికినప్పుడల్లా పేపర్ చదివేస్తుంటారని కృష్ణతేజ అన్నారు. 
 
ఇదే విధానం తెలుగు రాష్ట్రాల్లో గ్యాడ్యువల్‌గా వస్తున్నాయని చెప్పారు. అయితే ఈ విషయం తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియదని.. తెలిస్తే కనుక ఎన్నికల ఫలితాలు మారిపోతాయని చెప్పారు. ఇంకా కేరళ వాసులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారని.. ఓటు వేసేందుకు ముందు కుటుంబంతో కలిసి మాట్లాడుతారని.. ఓటు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకొచ్చారు. 
 
ఓటు వేసే వ్యక్తి ఏం చేస్తాడు.. గతంలో వున్న వ్యక్తి ఏం చేశాడు.. అనే విషయాలను ఆరా తీసిన తర్వాతే ఓటు వేస్తారని కేరళ ప్రజలకు సమాజంపై వున్న అంకితభావంపై కృష్ణతేజ కితాబిచ్చారు. బైపోల్స్‌నే వాళ్లు అసెంబ్లీ ఎన్నికల తరహాలో తీసుకుని చర్చించి ఓటేస్తారని వెల్లడించారు.