బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2024 (10:21 IST)

డిప్యూటీ సీఎం పవన్ ఓఎస్‌డిగా పల్నాడు బిడ్డ కృష్ణతేజ

Krishna Teja
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వద్ద వున్న శాఖలకు 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇవ్వగల అధికారుల కోసం చూస్తున్నారు. ఎన్నికల ఏవిధంగా నూటికి నూరు శాతం ఫలితాలు రాబట్టారో అదేవిధంగా పదవిలో కూడా అన్ని శాఖలకు నూటికి నూరు శాతం ఫలితాలను రాబట్టి తద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న పల్నాడు బిడ్డ కృష్ణతేజను ఎంపికు చేసుకున్నారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళ లోని త్రిసూర్ జిల్లా కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి, పర్యాటక శాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, కేరళ లోని అలప్పుజ జిల్లా కలెక్టరుగా సేవలను అందించారు. రెండు రోజుల కిందటే సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలిశారు కృష్ణ తేజ.