సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జూన్ 2024 (12:45 IST)

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

sai dharam tej gift
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, తన మేనమామ పవన్ కళ్యాణ్‌‌కు మేనల్లుడైన హీరో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకంగా ఓ అరుదైన బహుమతిని ఇచ్చాడు. పవన్‌లోని పిల్లాడికి ఈ బహుమతి అంటూ సాయి ఓ ట్వీట్ చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారిన పవన్ కళ్యాణ్‌కు నలువైపుల నుంచి అభినందలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పవన్‌ను అభినందిస్తున్నారు. ఇటీవలే అన్నావదిన చిరంజీవి - సురేఖ దంపతులు పవన్‌కు ప్రత్యేకంగా అత్యంత ఖరీదైన పెన్ను బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా తన మేనమామకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. "స్టార్ వార్స్ అండ్ లెగో" కిట్‌ను బహుమతిగా అందజేశారు. స్టార్ వార్స్ లెగోలను నాకు పరిచయం చేసిన వ్యక్తి నా ప్రియమైన జేడీ మాస్టర్. (స్టార్ వార్ అనేది ఓ కల్పిత పాత్ర). డిప్యూటీ సీఎంకు ఎట్టకేలకు ఒక బహుమతి ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి మేనల్లుడి ఇచ్చిన బహుమతి ఇది. ఫోర్స్‌ కూడా మాతోనే ఉంటారు" అంటూ సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.